స్క్రీన్‌పై నాటి ఎన్నికల వీడియో క్లిప్పింగ్‌ను చూపుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
నాలుగు నెలల పాలనలో అన్ని వర్గాలకు మోసం
ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజం
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు.
వీడియోలతో విమర్శనాస్త్రాలు
బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment