
కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లాలో ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురయ్యారు. విధులకు వెళ్లిన టీచర్.. విగతజీవిగా కనిపించారు. వివరాలు.. మేలుకోటె ఎస్‌ఈటీ పబ్లిక్ పాఠశాలలో మాణిక్యనహళ్లికి చెందిన దీపిక అనే మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త లకేష్.. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.
గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె..ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చెందిన ఈమె భర్త లోకేశ్ మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారని ఎస్పీ యతీశ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment