వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. గ్రీన్ కార్డు కోసం వేచి వున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఊరట నివ్వనున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన విధానంలో సరికొత్త మార్పులకు ప్రతిపాదించారు. కుటుంబ సంబంధాల ఆధారంగా గాకుండా నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు జారీలో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
ప్ర ప్రస్తుం 66శాతం కుటుంబ సంబంధాలు ద్వారా ( గ్రీన్‌కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయడం) 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా హెచ్1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్‌కార్డుకోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది.
Comments
Please login to add a commentAdd a comment