New immigration order
-
‘గ్రీన్‌కార్డు’ ఆశావహులకు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రతిభ ఆధారిత నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అత్యున్నతస్థాయి నైపుణ్యమున్న విదేశీయులకు జారీచేస్తున్న వీసాలను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామన్నారు. విదేశీయులకు అమెరికాలో జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసాలను తెస్తామన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం కారణంగా భారత ఐటీ నిపుణులు గణనీయంగా లబ్ధిపొందే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచదేశాలతో పోటీ.. కెనడా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఈ కొత్త వలసవిధానంలో పాయింట్లు కేటాయిస్తామని తెలిపారు. ‘ఈ విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వ పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తాం. ప్రస్తుతం అమెరికా వలసవిధానం లోపభూయిష్టంగా ఉంది. దీనికారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాలల్లో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు కూడా ఓ డాక్టర్‌గా, పరిశోధకుడిగా, విద్యార్థిగా మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ కొత్తవిధానం ఓసారి ఆమోదం పొందితే నైపుణ్యవంతుల్ని ఆకర్షించే విషయంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది’ అని ట్రంప్ వెల్లడించారు. మిశ్రమ స్పందన.. ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభలో హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు మైక్ రోజర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనివల్ల సరిహద్దు భద్రత పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కొత్త విధానం వలసలకు వ్యతిరేకమనీ, ఇది కేవలం రాజకీయ జిమ్మిక్కు తప్ప మరేమీకాదని సెనెట్‌లో మైనారిటీ నేత చక్ స్చుమెర్ విమర్శించారు. నూతన విధానంలో దూరదృష్టి కొరవడిందని ఇండో–అమెరికన్, సెనెటర్ కమలా హ్యారిస్ పెదవివిరిచారు. ఆసియా సంతతి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వలస వెళతారని హ్యారిస్ గుర్తుచేశారు. ‘గ్రీన్‌కార్డు’ ఆశావహులకు ఊరట కొత్త విధానంలో నైపుణ్యవంతులైన విదేశీ కార్మికులకు గ్రీన్‌కార్డుల్లో 57 శాతం కేటాయిస్తామని ట్రంప్ ప్రకటించడం కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం ఒక్కో భారతీయుడు పదేళ్ల పాటు వేచిచూడాల్సి వస్తోంది. కొత్తవిధానంలో వీరందరికీ త్వరితగతిన గ్రీన్‌కార్డులు మంజూరవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొత్త వలసవిధానం కారణంగా లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్‌కార్డు లభిస్తుందని పేర్కొన్నారు. గ్రీన్‌కార్డుల కోటాను అవసరమైతే 57 శాతానికి మించి పెంచుతామనీ, అదే సమయంలో ఏటా జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల సంఖ్యను తగ్గించబోమని ట్రంప్ ప్రకటించడాన్ని వీరు స్వాగతించారు. -
అమెరికాకు రావాలనుకునేవారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే
-
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. గ్రీన్ కార్డు కోసం వేచి వున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఊరట నివ్వనున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన విధానంలో సరికొత్త మార్పులకు ప్రతిపాదించారు. కుటుంబ సంబంధాల ఆధారంగా గాకుండా నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు జారీలో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ప్ర ప్రస్తుం 66శాతం కుటుంబ సంబంధాలు ద్వారా ( గ్రీన్‌కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయడం) 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా హెచ్1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్‌కార్డుకోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. -
కొత్త వలస విధానంపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాక్‌కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కొత్త వలస విధాన చట్టంలో నిషేధిత దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించిన తర్వాత ఈ విషయం వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ వలస విధానం గురించి ప్రసంగించారు. దేశ భద్రతను పెంచడం, పకడ్బందీగా చట్టాలను అమలు చేయడం, అమెరికన్లకు ఉద్యోగాలను, వేతనాలు పెంచడంపై దృష్టిసారిస్తున్నామని, కొత్తవలస విధాన చట్టం సానుకూలంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ ఉత్తర్వులు చెల్లవంటూ అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త వలస విధాన చట్టం తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురానున్నారు. ట్రంప్ దీనిపై సంతకం చేయనున్నారు.