
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సోమవారం హైకోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మందికిపైగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని.. అర్హత కన్నా ఎక్కువ మార్కులు సాధించినా మెరిట్ లిస్ట్‌లో తమ పేరు లేదని పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment