ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. వైద్య శాస్త్రంలో కూడా మానవుడు చాలా పురోగతి సాధించాడు. ఈ క్రమంలో గతంలో సాధ్యం కానివాటిని కూడా సాధ్యపడేలా చేస్తున్నారు వైద్యులు. ఇటీవల కొందరు తమ రూపాన్ని మార్చుకోవడానికి తరచుగా ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ శస్త్రచికిత్సలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల, 20 ఏళ్ల మహిళ ముక్కుపై కుక్క కొరికింది. అందుకే ఆమె శస్త్రచికిత్స చేయించుకుంది, అయితే ఆపరేషన్ చేసిన ప్రదేశంలో వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి. అసలు అలా ఎందుకు జరిగిందంటే..
గత సెప్టెంబరులో ట్రినిటీ రౌల్స్ అనే యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లగా.. అక్కడ ఒక కుక్క దాడి చేసి ఆమె ముక్కును కొరికింది. ఈ ఘటనలో ట్రినిటి తన ముక్కు కొనను కోల్పోయింది. ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కుక్క దాడి కారణంగా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే ఆమె ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక సర్జరీలు చేశారు. కానీ స్కిన్ గ్రాఫ్ట్ అని పిలువబడే ఒక ఆపరేషన్ ఆమె ముఖంలో భారీ మార్పులకు దారితీసింది.
ప్రస్తుతం ఇప్పుడేమో ఆమె కోలుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌లో భాగంగా వైద్యులు ఆమె నుదిటిపై ఉన్న ప్రాంతం నుండి చర్మాన్ని తీసి ఆమె ముక్కుపైకి అమర్చారు. ఇది ఆమె ముఖంలో సాధారణ రూపాన్ని పునరుద్ధరించింది, కానీ కొన్ని రోజుల్లో, ఆమె సమస్య మరింత తీవ్రమైంది. దీని వల్ల ఆమె ముక్కుపై వెంట్రుకలు మొలవడం మొదలైంది. ప్రస్తుతం ఈ వెంట్రుకల తొలగింపుకు ట్రినిటీ చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన బాధను పంచుకుంది ట్రినిటి. నెటిజన్లు కూడా ట్రినిటి ఫోటోని చూసి ఆశ్చర్యపోతున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.
చదవండి: Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment