
మెగాస్టార్ చిరంజీవి మరో ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త గుప్పుమంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ ఆయన 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారట! హైదరాబాద్‌లో కాకపోతే ఢిల్లీ లేదా బెంగళూరులో ఈ ఆపరేషన్ జరగవచ్చన్నది సమాచారం.
ఈ ఆపరేషన్ తర్వాత దాదాపు 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి! సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్నానే తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేశ్ వల్లే చిరంజీవికి ఇటువంటి ఫ్లాప్ వచ్చిందని ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే! బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఇకపోతే బింబిసార డైరెక్టర్ వశిష్టతో చిరు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఫైనలవుతుందో? ఏది చిరుకు విజయాన్ని బహుమతిగా ఇస్తుందో చూడాలి!
చదవండి: భోళా ఎఫెక్ట్.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment