Prabhas Undergoes Minor Surgery For Injury During Salaar Shooting In Spain - Sakshi
Sakshi News home page

Prabhas Surgery: షూటింగ్‌లో గాయం.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సర్జరీ

Published Sat, Mar 19 2022 9:56 AM | Last Updated on Sat, Mar 19 2022 10:27 AM

Prabhas Undergoes Minor Surgery For Injury During Salaar Shooting In Spain - Sakshi

Prabhas Undergoes Minor Surgery: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆసుపత్రిలో చేరాడు. షూటింగ్‌లో గాయపడటంతో సర్జరీ కోసం ఆయన స్పెయిన్‌ వెళ్లారు. రీసెంట్‌గా రాధేశ్యామ్‌తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల కొందట ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌లో గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయన సర్జరీ కోసం స్పెయిన్‌ వెళ్లారు.

అక్కడే బార్సిలోనాలో ఆయనకు చిన్న శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తుంది. చికిత్స అనంతరం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక ప్రభాస్‌ సర్జరీ గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం  ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు డైరెక్టర్‌ మారుతీతో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement