
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ రెండక్షరాల పదమే అయిన ప్రేమికుల చేత ఎంతటి పనైనా చేస్తుంది. దీనిక ఆడా లేదా మగ అతీతం కాదు. తమకు నచ్చిన వారికోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అచ్చం అలానే ఒక లెస్బియన్ జంట ఎంతటి సాహాసానికి ఒడిగట్టారో వింటే షాక్ అవుతారు.
అసలేం జరిగిందంటే... యూపీకి చెందిన ఇద్దరూ లెస్బియన్లు ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. తాము ఇక ఒక్కటవ్వాలని నిర్ణయించుకంటారు. అందుకోసం తమ పెద్దవాళ్లను ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించకపోవడంతో ఏం చేయాలో పాలోపోలేదు. ఇక చివరికి లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకై ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని వైద్యుల బృందాన్ని సంప్రదించారు కూడా.
సదరు మహిళకు టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తామని వైద్యులు చెప్పారు. ఐతే ఆమె అతడుగా మారడానికి సుమారు ఒకటిన్నర సంవత్సారాలు పడుతుందని తెలిపారు. లింగ మార్పిడి తర్వాత ఆమె గర్భందాల్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇలాంటి అపరేషన్‌ని నిర్వహించడం ఇదో తొలిసారని, దాదాపు 18 నెలల వ్యవధి పడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment