
తమిళసినిమా: అందమైన నటీమణులకు బరువు అనేది పెద్ద భారం అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. నటి అనుష్క వంటి వారికి ఇది కష్ట సాధ్యంగానే మారిందని చెప్పక తప్పదు. అయితే మరో బ్యూటీ హన్సిక మాత్రం బరువు తగ్గడం అనేదాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్‌గా మారింది.
ముంబయి భామ హన్సిక బాల నటిగా హిందీలో కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక కోలీవుడ్లో ధనుష్ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి.
విజయ్‌కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాగా స్లిమ్‌గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు.
(చదవండి: యాసలందు అన్ని యాసలూ లెస్స)
Comments
Please login to add a commentAdd a comment