కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఠాకూర్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఠాకూర్ షేర్ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్‌గా ఠాకూర్ ఇచ్చాడు.
కాగా ఠాకూర్ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.
దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఠాకూర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment