ఇదేమి బౌలింగ్‌రా బాబు.. ఇతడితోనా వరల్డ్‌కప్‌ ఆడేది! రోహిత్‌ సపోర్ట్‌తోనే!! | Netizens Troll Shardul Thakur For Being Expensive In Ind Vs Aus 1st ODI - Sakshi
Sakshi News home page

Trolls On Shardul Thakur: ఇదేమి బౌలింగ్‌రా బాబు.. ఇతడితోనా వరల్డ్‌కప్‌ ఆడేది! రోహిత్‌ సపోర్ట్‌తోనే!!

Published Sat, Sep 23 2023 9:28 AM | Last Updated on Sat, Sep 23 2023 12:04 PM

Netizens troll Shardul for being expensive in IND vs AUS 1st ODI - Sakshi

వరల్డ్‌కప్‌ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది.  మొహాలీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్‌ విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినప్పటికీ.. ఫాస్ట్‌ బౌలర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ ప్రదర్శన మాత్రం అందరనీ కలవరపెడుతోంది. మొహాలీ వన్డేలో శార్ధూల్‌ ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్‌లో శార్ధూల్‌ పూర్తిగా తేలిపోయాడు. 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఠాకూర్‌ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. మిగితా నలుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ అయినా పడగొట్టగా.. శార్ధూల్‌ మాత్రం ఒక్క వికెట్‌ కూడా దక్కించుకోలేకపోయాడు. వికెట్‌ మాట పక్కన పెడితే.. తన బౌలింగ్‌తో బ్యాటర్లను కనీసం కట్టడి కూడా చేయలేకపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన శార్ధూల్‌ ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు.

అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయాల్పింది..
కాగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శార్ధూల్‌ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వరల్డ్‌కప్‌కు ముందు ఇటువంటి ప్రదర్శన చేసిన శార్ధూల్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతడు ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి ఆర్హుడు కాదని, అతడిలో ఏమి టాలెంట్‌ చూసి సెలక్టర్లు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అతడి స్ధానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయాల్సందని భారత ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సపోర్ట్‌తోనే శార్థూల్‌ జట్టులో కొనసాగతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక రెండో వన్డేకు అతడిపై వేటు పడే ఛాన్స్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement