వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్..
మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ ఆటగాడు, ఏన్సీఏ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ వరల్డ్‌కప్‌తో ముగియనుంది.
ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ధరఖాస్తులను అహ్హనించనుంది. కొత్త కోచ్ వచ్చేటప్పటికి సమయం పట్టే అవకాశమున్నందన లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్‌లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా లక్ష్మణ్ ఇప్పటికే చాలా సిరీస్‌లలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐర్లాండ్, జింబాబ్వే టూర్‌లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు.అతడి పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది.
చదవండి: WC 2023: పాండ్యా లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment