వన్డే ప్రపంచకప్-2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో అతిథ్య భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 6 విజయాలు సాధించిన టీమిండియా సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలైన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
కాగా పాయింట్ల పట్టికలో టాప్-4లో వరుసగా భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరుకు అర్హత సాధించే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.
వరల్డ్‌కప్ ఫైనల్ కచ్చితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే టీమిండియా టైటిల్ ఫేవరేట్ అంతా భావిస్తున్నారు. కానీ స్వదేశంలో వరల్డ్‌కప్ జరుగుతుండడంతో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తడి ఉంటుంది.
ఒత్తడి ఎంత పెద్ద జట్టు అయినా తప్పులు చేస్తుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధిస్తే.. ప్రత్యర్ధిపై పై చేయి సాధించే ఛాన్స్ ఉందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్ పేర్కొన్నాడు. కాగా అగర్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.
చదవండి: WC 2023: కుల్దీప్‌పై రోహిత్ శర్మ సీరియస్.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment