
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ "జార్వో 69" గుర్తున్నాడా మీకు? అదేనండీ 2021లో ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి వచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించే వాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ జార్వో అలియాస్ డేనియెల్ జార్విస్ మరోసారి గ్రౌండ్‌లో ప్రత్యక్షమయ్యాడు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా జెర్సీ ధరించి జార్వో మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే జార్వో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అతడు బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో టీమిండియా స్టార్ కోహ్లి రంగంలోకి దిగాడు. అతడి దగ్గరికి వెళ్లి బయటకు పంపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: #indvsaus: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా
Jarvo 69 is back, Last time when he invaded the field, Rohit Sharma scored match winning hundred🫣 pic.twitter.com/z6yYQi7AqG
— David. (@CricketFreakD3) October 8, 2023
Comments
Please login to add a commentAdd a comment