ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గ రేంజ్‌లో ఘరానా దోపిడీలు, హైటెక్ మోసాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో మరింత ఘోరం. మనుషులకు తెలియకుండా అవయవాలు దోచేసుకుని వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిన ఉదంతాలు కోకొల్లలు. వైద్యో నారాయణ హరిః అన్న వాక్యం వెలవెలబోయేలా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి దిగ్బ్రాతికర ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..సంజ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్‌కి ఆ రోజు రాత్రితో తాను అతడుగా ఉండటం ఆఖరు అని ఊహించలేదు. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారి జీవితాన్ని శాపంగా మారుస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిద్ర పోయేంతరకు మగవాడిగా ఉన్నవాడు కాస్త మేలుకునేటప్పటికీ 'ఆమె'గా మారిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజాహిద్ గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ అనే వ్యక్తి చేతిలో వేధింపులకు గురవ్వుతున్నట్లు తెలిపారు.
తనతో కలిసి జీవించాలని ఉందంటూ ఓం ప్రకాష్ మజిహిద్ తనతు చెప్పేవాడని మజిహిద్ పేర్కొన్నాడు. అయితే దీన్ని తన సమాజం, కుటుంబం అంగీకరించిందని ముజాహిద్ వ్యతిరేకించడంతో బెదిరింపులకు దిగేవాడని వాపోయాడు. అస్సలు తాను ఆస్పత్రికి రాలేదనని ఓం ప్రకాశ్‌నే ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చాడు. పడుకుని లేచి చూచేటప్పటికీ లింగ మార్పిడి శస్త్ర జరిగిపోయిందని భోరును విలపిస్తున్నాడు ముజాహిద్. ఓం ప్రకాష్ వైద్యలతో కుమ్మకై తనకు ఈ ఆపరేషన్ చేయించినట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ తన వద్దకు వచ్చి మగవాడిని కాస్త స్త్రీగా మార్చాను. "ఇక నువ్వు నాతోనే జీవించాలి లేదంటే నీ తండ్రిని చంపి మీకున్న భూమిని కూడా లాక్కుని లక్నో పారిపోతానని బెదిరించాడని". ముజాహిద్ కన్నీటి పర్యంతమయ్యాడు.
అంతేగాదు ఆస్పత్రి రికార్డులో సైతం అతడికి ఏదో వైద్య సమస్యతో అక్కడకు వచ్చినట్లు ఉండటం గమనార్హం. ఈ మేరకు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఓం ప్రకాష్‌ని అరెస్టు చేయడమే గాక ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా క్షణ్ణంగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనపై బీకేయూ కార్యకర్తల రైతు నాయకుడు శ్యామ్‌పాల్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు దిగారు.
ఈ ఆస్పత్రిలో బాధితుల సమ్మతి లేకుండానే అవయవాల మార్పిడి, లింగ మార్పిడి వంటి రాకెట్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధకరమని, వెంటనే అందుకు గల బాధ్యుల తోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఆందోళనకారులు నిరసనలను విరమింప చేయడమే కాకుండా ఈ ఘటపై సత్వరమై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
(చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..)
Comments
Please login to add a commentAdd a comment