5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స  | Hyderabad: Nims Doctors Fixed The Cranial Problem Of 5 Month Old baby | Sakshi
Sakshi News home page

5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స 

Published Tue, Apr 12 2022 5:00 AM | Last Updated on Tue, Apr 12 2022 3:08 PM

Hyderabad: Nims Doctors Fixed The Cranial Problem Of 5 Month Old baby - Sakshi

లక్డీకాపూల్‌:  నిమ్స్‌ మరో అరుదైన చికిత్స చేసి తన ప్రత్యేకతను చాటుకున్నది. 5నెలల చిన్నారి కపాళ సమస్యను నిమ్స్‌ వైద్యులు పరిష్కరించారు. కాకినాడకు చెందిన ఓ చిన్నారికి కపాళంలో ఎముకలు  అతుక్కుపోయాయి.  కపాళంలోని ఎముకలు కొంత వయస్సు వచ్చిన తర్వాత కర్సుకుపోవడం సర్వసాధారణం. కానీ, పుట్టుకతోనే రావడంతో ఆ చిన్నారి ముఖం సహజ రూపురేఖలను కోల్పోయింది.

దీంతో పాప తల్లిదండ్రులు నిమ్స్‌ న్యూరోసర్జరీ విభాగం వైద్యులను ఆశ్రయించారు. ఆ విభాగం అధిపతి డాక్టర్‌ ఎర్రం నేని వంశీకృష్ణ ప్రాథమిక వైద్యపరీక్షల ద్వారా ఆపరేషన్‌ అవసరాన్ని గుర్తించి, ముక్కు ద్వారా సమస్యను చక్కదిద్దారు. ఎండోస్కోపీ విధానంలో కపాళం ఎముకలో కొంత మేర తొలగించి రెండు ఎముకలను సరిచేశారు. ఈ శస్త్రచికిత్సతో చిన్నారి ముఖం మామూలుస్థితికి వచ్చిందని, ఆపరేషన్‌ విజయవంతం కావడంతో చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామని డాక్టర్‌ వంశీ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement