
పుర్రెతో ఎయిర్ పోర్ట్‌కు వచ్చి..!
రోమ్: పుర్రెతో ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఓ ప్రొఫెసర్ రోమ్ అధికారులను బెంబేలెత్తిపోయేలా చేశాడు. జర్మనీకి వెళ్లేందుకు సిద్ధమైన అతడిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను పరిశోధనలు చేయడానికి పుర్రెను తీసుకెళ్తున్నట్టు, దానికి రోమ్ చారిత్రక కేంద్ర వీధిలో 50 యూరోలను కూడా చెల్లించినట్లు పోలీసులకు చెప్పాడు.
ఫియూమిసినో ఎయిర్పోర్టు వద్ద భద్రతలో భాగంగా నిందితుడి లగేజీని స్కానర్లో చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది తొలుత ఈ పుర్రెను గమనించారు. అతడు జర్మనీలోని డస్సెల్డోర్ఫ్కు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ విభాగం పుర్రెను సీజ్ చేసి, దవడ భాగంలో కనిపించకుండా పోయిన ఎముకను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.