- మార్చి నుంచి బీడీ కంపెనీల బంద్
కోరుట్ల: బీడీ కట్టలపై పుర్రె గుర్తు సైజు పెం పు.. విడికట్టలు అమ్మరాదన్న నిబంధనల పై బీడీ కంపెనీల యాజమాన్యాలు మార్చి నుంచి బంద్‌కు సిద్ధమయ్యాయి. వారంరోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీల యాజమాన్యాలు తమ సమస్యలను కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ అధికారులకు విన్నవించినా స్పందన కానరాకపోవడం తో ఆందోళనకు సిద్ధమయ్యాయి. గురువారం నిజామాబాద్‌లో కార్మిక సంఘాలతో సమావేశమై మద్దతు కోరగా అవి సానుకూలంగా స్పందించాయి. ఈ నెల 15న బీడీ కంపెనీల యజమానులు, కార్మిక సంఘాల నేతలతో ఢిల్లీకి వెళ్లి కార్మిక శాఖ అధికారులతోపాటు ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారు.