టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు? | Migration into TRS | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు?

Published Tue, Feb 25 2014 3:27 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు? - Sakshi

టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు?

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాజకీయ సమీకరణలు అన్నీ మారిపోతున్నాయి. వలసలు కూడా ఊపందుకున్నాయి. కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనం అంశం ఒక కొలిక్కి రాకముందే టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఏ లక్ష్యం కోసం టిఆర్ఎస్ ఏర్పడిందో  ఆ లక్ష్యం సాధించడంతో అందరి చూపు అటువైపే మళ్లుతోంది.

టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇప్పటికి అనేక మంది టిఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రత్నం, మహేందర్ రెడ్డి ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కూడా అదేబాట పడుతున్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఢిల్లీలో కేసీఆర్తో  చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement