హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో అవినీతి అంటున్న కేసీఆర్ ముందుగా తన ఆస్తులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులు ప్రకటించాలని మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే ద్వారా బోగస్ లబ్దిదారుల ఏరివేత పేరుతో ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
కరెంట్ అడిగితే రైతులను, ఉద్యోగాలు అడిగితే విద్యార్థులను, హైకోర్టు అడిగితే లాయర్లపై లాఠీఛార్జ్ చేయించారని పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వలసలను ప్రోత్సహించడం ద్వారా ఇతర పార్టీలను బలహీనపరచడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాకు వెయ్యి కోట్లు అడిగితే వాటర్ గ్రిడ్ అంటూ 30వేల కోట్లే ఇచ్చి ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను రూపొందించారని పొన్నం అన్నారు.