వసల నేతలు తగ్గి మసలుకోవాలి | migrated leaders should down | Sakshi
Sakshi News home page

వసల నేతలు తగ్గి మసలుకోవాలి

Published Mon, Nov 28 2016 10:52 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

migrated leaders should down

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
ఆళ్లగడ్డ: కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు అనిగిమణిగి ఉండాల్సిందేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలు నాలుగడుగులు వెనక్కి తగ్గి మసలుకోవాలన్నారు.

పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలి తప్ప భంగం కలిగించేలా వ్యవహరించకూడదన్నారు. పార్టీలో సమస్యలను పరిష్కరించడంతన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఇరిగెల నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చాంద్‌బాషా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement