వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజికవర్గంలో రెండు రోజులుగా రైతుల వలసల పరంపర కొనసాగుతోంది.
ఎమ్మిగనూరు (కర్నూలు) : వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజికవర్గంలో రెండు రోజులుగా రైతుల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా మంగళవారం నందవరం మండలం సోమలగూడూరు నుంచి 100 రైతు కుటుంబాలు వలస దారి ఎంచుకుని బళ్లారి వెళ్లాయి.
అలాగే మంతలం మాచాపురం గ్రామం నుంచి 40 కుటుంబాలు వలస బాట పట్టాయి. ఉపాధి హామీ పథకం కడుపు నింపకపోవడంతో ఈ కుటుంబాలు వలస బాట ఎంచుకున్నాయి.