
బతుకు బాట.. వలస పాట
పొట్ట చేతబట్టి గిరిజనులు ఉపాధి బాటపట్టారు. గ్రామాలు, తండాల్లో పనులు లేకపోవడంతో వలస పోతున్నారు. మనూరు మండలం డోవూరు తండా, శేరి తండాకు చెందిన ఐదుగురు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెంది మూడు రోజులే అయినా.. ఆయా ప్రాంతాల నుంచి వలసలు ఆగ కపోవడం అక్కడి దుర్భిక్ష పరిస్థితికి అద్దం పడుతోంది.
- నారాయణఖేడ్
వలస గిరిజన కూలీల సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి క్రైం: జిల్లాలోని మూడు చక్కెర కర్మాగారాల్లో పనిచేసేందుకు వలస వస్తున్న గిరిజన కూలీల సమస్యలు పరిష్కరించాలని బంజారా సేవాలాల్ యువజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ చౌహాన్, రాథోడ్వ్రీందర్ నాయక్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. గిరిజనులు తాత్కాలిక గుడిసెలు వేసుకోవడం, కిరోసిన్ దీపాలు పెట్టుకోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు వివరించా రు. ఎడ్లబండ్లపై వస్తున్నవారు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వలస కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు.