వైఎస్సార్ సీపీలో చేరుతున్న గంగాపూర్ గ్రామస్తులు
- ఒక్కరోజే 1,500 మంది కార్యకర్తలు చేరిక
- అండగా ఉంటానన్న పార్టీ ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్
నారాయణఖేడ్/మనూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ముమ్మరమయ్యాయి. రోజుకో గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మనూరు మండలంలోని మావినెళ్ళి, తోర్నాల్, బెల్లాపూర్, హుక్రానా గ్రామాలకు చెందిన సుమారు1500 మంది వివిధ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో అప్పారావు షెట్కార్ మాట్లాడుతూ, స్థానిక నేతల నిర్లక్ష్యం వల్లే నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందన్నారు. తలాపునే మంజీరా నది ప్రవహిస్తున్నా, ఖేడ్ నియోజకవర్గానికి సాగునీటిని అందించడంలో పాలకులు పూర్తిగా విఫల మయ్యారన్నారు.
వైఎస్సార్ మంజూరు చేసిన నిధులకు సంబంధించిన పనులే గత ఐదేళ్లుగా ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అందువల్ల ఖేడ్ ఓటర్లంతా బాగా ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపితే, ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతానన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వైఎస్సార్‌సీపీలో ప్రతి కార్యకర్తకు సముచితస్థానం ఉంటుందన్నారు. పార్టీలో చేరినవారిలో మావినెళ్ళి వార్డు సభ్యులు రమేశ్.
గుర ప్ప, జరప్ప, సంగ్‌శెట్టి, శరనప్ప, ధశరథ్, క ల్లప్ప, రాజు, సురేందర్, మాణిక్, మారుతి, అంజయ్య, బస్వరాజ్, నాగ్‌శెట్టి, కాశప్ప, హ వప్ప, మల్లప్ప, రాజు, పహీమ్‌లతో పాటు 500 మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక బెల్లాపూర్‌లో ఎం.రాజుగొండ, ఎండీ.ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జహంగీర్, సుభాష్ రెడ్డి, జి. రాజు, వి.పండరి, ఎం.డీ.ఆసీఫ్, ఎ.రవీంద ర్, అఖిల్, బసప్ప, ఎం.సంజీవ్, సీహెచ్.నర్సింలు, లక్ష్మణ్, దత్తు, బీరప్ప, ఎం.డీ.నసీరోద్దీన్, డి.సంతు, సాయిలు, జె.రాజు, ఎం. డీ.గౌసోద్దీన్, విఠల్‌గొండ, పోచుగొండ, గో పాల్, అనిల్, ఆధ్వర్యంలో 300 మంది వై ఎస్సార్ సీపీలో చేరారు.
ఎన్.జీ.హుక్రానాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. తోర్నాలకు చెందిన శివప్ప పాటిల్ ఆధ్వర్యం లో 300 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీ లో చేరారు. నారాయణఖేడ్ మండలం గం గాపూర్‌కు చెందిన తిప్పుగొండ, అంజిగొండ, జ్ఞా నేశ్వర్, నారాయణ, ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. నారాయణఖేడ్ పట్టణం గౌలిగల్లికి చెందిన గౌలి విక్రమ్, గురు, జగదీశ్వర్, సంతోష్, శ్రీకాంత్, గణేశ్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.