వలస బాటలో మృత్యుఒడి
Published Sun, Mar 19 2017 11:46 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
ఆదోని రూరల్: సంతెకొడ్లూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు వలస బాటలో మృత్యుఒడి చేరాడు. గ్రామానికి చెందిన వెంకప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకు వివాహమైంది. గ్రామంలో ఉపాధి పనులు లేక గుంటూరు మిరప కోతకు వలస వెళ్లారు. ఇటీవలె తమ గ్రామంలో హోలీ వేడుకల సందర్భంగా గ్రామానికి వచ్చి నాలుగు రోజుల క్రితం తిరిగి వెళ్లారు. ఇద్దరు కుమారులను కూడా వెంట తీసుకెళ్లారు. ఆదివారం మిరపతోటలో పని చేస్తుండగా పెద్ద కుమారుడు వెంకటేష్ (14)పాము కాటుకు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
Advertisement
Advertisement