సీమ అభివృద్ధికి ఉద్యమిద్దాం
ఎస్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహులు
డోన్ టౌన్: రాయలసీమ అభివృద్ధికి ఉద్యమిద్దామని ఎస్టీయూ రాష్ట్రగౌరవాధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్‌జీవోస్ హోంలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన జిల్లాలోని హŸళగుంద నుంచి ప్రారంభమయ్యే జీపుజాత 30వ తేదీన డోన్ చేరుకుంటుందన్నారు. ఈ జాతాను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులను కోరారు. విద్యా, వైద్య రంగాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. సమావేశంలో కన్వీనర్ ఎన్‌ఎస్‌బాబు కో కన్వీనర్ శివశంకర్, అఖిలపక్ష నాయకులు మాణిక్యం శెట్టి, ప్రసాద్‌రెడ్డి, రాజ్‌కుమార్, శ్రీనివాసశర్మ, మద్దయ్య, శివరామ్, ఎల్లయ్య, రామాంజనేయులు, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.