![విహారయాత్రలో విషాదం](/styles/webp/s3/article_images/2017/09/4/71470593453_625x300.jpg.webp?itok=ui1bQIIE)
విహారయాత్రలో విషాదం
ఏకేబీఆర్ మెయిన్ కెనాల్‌లో పడి వ్యక్తి మృతి
– పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘటన
పెద్దఅడిశర్లపల్లి
విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తన బంధువులతో కలిసి ఆదివారం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చిన వ్యక్తి మెయిన్ కెనాల్‌లో పడి తినిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహమ్మద్ ఖలీల్‌ఖాన్ (41) స్థానికంగా ఉంటూ వ్యాపారం నిర్వహించేవాడు. మహమ్మద్ ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి సెలవు దినం కావడంతో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చారు. ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి భోజనం చేసి స్నానం చేయడానికి ఏఎమ్మార్పీ మెయిన్ కాల్వలోకి దిగాడు. కాగా ఖలీల్‌ఖాన్ నీటిలో ఈత కొడుతూ అలిపిరి వచ్చి ఊపిరాడక మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి బయటకు తీయగా అప్పటికే ఖలీల్‌ఖాన్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని గుడిపల్లి ఎస్‌ఐ భోజ్యానాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు మహమూద్, సిబ్బంది వెంకట్, జాని, హోంగార్డు సైదులుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.