వేంపెంట దీక్షలకు 700రోజులు
వేంపెంట(పాములపాడు): మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం నాటికి 700రోజులకు చేరాయి. ఈ దీక్షల్లో సామ్రాజ్యమ్మ, భారతి, అన్నమ్మ, చిన్నక్క, రూతమ్మ, లచ్చమ్మ, సుశీలమ్మ, దుర్గా సుశీలమ్మ కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. బడాబాబులకు ఊడిగం చేసే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు. పవర్‌ప్లాంటు నిర్మాణం వల్ల జరిగే అనర్థాల గురించి చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా నిర్మాణానికి ఎలా అనుమతులు వచ్చాయని ప్రశ్నించారు. తప్పుడు అనుమతి పత్రాలతో నిర్మాణపనులకు శ్రీకారం చుట్టిన ర్యాంక్‌మినీ పవర్‌ప్లాంట్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామానికి నష్టం కలిగించే ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒçప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.