contractor house
-
కాంట్రాక్టర్ ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు మస్తాన్పేటకు చెందిన రైల్వే క్యాంటిన్ కాంట్రాక్టర్ ఆర్.సుధాకర్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.25 వేల నగదును చోరీ చేసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఉక్కపోత భరించలేక కుటుంబ సభ్యులందరూ కలసి ఇంటికి తాళం వేసి, మిద్దెపై నిద్రించారు. తెల్లవారుజామున వచ్చి చూడగా.. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసమై ఉన్నాయి. నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. -
కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు
పాల్వంచ: ఖమ్మం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పాల్వంచలోని కేఎస్పీ రోడ్డులో నివాసం ఉండే వెంకటేశ్వర్లు మూడు రాష్ట్రాల్లో పవర్ప్లాంట్లలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి వెంకటేశ్వర్లు ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.