ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి | Rs.17.5 lakhs robbery in krishna district | Sakshi
Sakshi News home page

ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి

Published Tue, Jul 19 2016 8:33 AM | Last Updated on Thu, Sep 27 2018 4:24 PM

ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి - Sakshi

ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి

కంకిపాడు: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు చెరువు కట్టపై ఇన్‌కంటాక్స్ అధికారుల పేరుతో కైకలూరుకు చెందిన చేపల వ్యాపారి చొక్కరపు శ్రీనివాస్ నుంచి 17.5 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాస్ వ్యాపార లావాదేవీలు ముగించుకుని 17.5 లక్షల రూపాయల నగదుతో కారులో కంకిపాడు మీదుగా కైకలూరుకు బయలుదేరారు. పునాదిపాడు చెరువు కట్టపైకి వచ్చేసరికి వెనుకనుంచి ఎర్ర బుగ్గ కారు ఓవర్‌టేక్ చేసి వచ్చి కారును ఆపారు. తాము ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారమని, కారును తనిఖీ చేయాలని చెప్పారు.

సూట్‌కేసులో ఉన్న 17.5 లక్షల రూపాయలను వారు తీసుకుని , ఈ మొత్తానికి లెక్క చెప్పాల్సి ఉంటుందని... తమ వెంట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారు. అనంతరం సదరు నగదు ఉన్న సూట్‌కేసును తీసుకుని వారు తమ కారులో బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఎర్ర బుగ్గ ఉన్న కారు వేగం పెంచి మరోదారిలో వెళ్లి కనుమరుగయ్యారు. తాను మోసపోయానని భావించిన శ్రీనివాస్ వన్ టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా  సదరు రహదారిలోని సీసీ కెమెరా ఫూటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement