
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూర్వకంగా తమపై సోదాలు చేయిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ నరేంద్ర మోదీతో కలిసి ఐటీ, ఈడీ విచారణ ముసుగులో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరుతో తమ ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. విచారణలో ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పానన్నారు. తన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొవడానికి తాను సిద్ధమన్నారు.
ఐటీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. 23న మరోసారి విచారణకు హాజరుకావాలని ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment