సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నందుకే రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, కానీ కేసీఆర్ సభ ఉందంటూ రేవంత్‌రెడ్డిని తెల్లవారుజామున అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని, మోదీతో కుమ్మక్కైన కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. సమావేశంలో మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, మాజీ కౌన్సిలర్ బాలస్వామి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి పాటుపడాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ అన్నారు. పట్టణ కమిటీ ప్రధా న కార్యదర్శిగా షేక్ అబ్దుల్ సలీం, కార్యదర్శిగా షేక్ అన్సార్ ఇమాంను నియామకం చేసి వారికి మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉత్తర్వులు అందజేశారు. లక్ష్మణ్‌యాదవ్ మాట్లాడుతూ పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నూతన కా ర్యదర్శులు అబ్దుల్ సలీం, అన్సార్ ఇమాం మా ట్లాడుతూ తమపై నమ్మకంతో పదవులు అప్పగించిన రాష్ట్ర, జిల్లా, పట్టణ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్‌గౌడ్, నేతలు సయ్యద్ ఇస్మాయిల్, బాలస్వామి, జమీర్ అహ్మద్, ఎంఎ.ముజీబ్, అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment