అవినీతి కేసు: ఐటీ అధికారులు అరెస్ట్
అవినీతి కేసు: ఐటీ అధికారులు అరెస్ట్
Published Fri, Sep 8 2017 7:36 PM | Last Updated on Thu, Sep 27 2018 4:31 PM
సాక్షి, రాంచి : అవినీతి కేసుతో సంబంధమున్న నలుగురు ఆదాయపు పన్ను శాఖ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కుట్ర, క్రిమినల్ దుష్ఫర్తన వంటి కారణాలచే రాంచిలోని పలువురు ఐటీ అధికారులపై సీబీఐ జూలై 10నే ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. అనంతరం వీరిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా నలుగురు ఐటీ అధికారులను శుక్రవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో భాగంగానే రాంచి ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రధాన కమిషనర్‌ను జూలై 12నే సీబీఐ అరెస్ట్‌చేసింది.
నేడు అరెస్ట్ చేసిన మరో నలుగురు అధికారుల్లో రంజిత్ కుమార్ లాల్, సునిల్ కుమార్ గుప్తా, తరుణ్ రాయ్, వినోద్ కుమార్ పాల్‌లు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో పన్ను పడిన వ్యాపారవేత్తల నుంచి భారీగా లంచం తీసుకుని వీరు అవినీతికి పాల్పడినట్టు సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సమీప ప్రాంతాలు కోల్‌కత్తాలోని 18, రాంచిలోని 5 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.3.7 కోట్ల నగదు, 6.6 కేజీల బంగారం, నాలుగు కోట్ల విలువ చేసే ఫ్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
Advertisement