శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీవారి దర్శనంతో పాటు అన్ని విభాగాల్లోనూ ఆదాయం గత ఏడాది కంటే ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. భక్తులకు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించటంతోపాటు హుండీ కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకం .. వంటి విభాగాల్లో భారీగా పెరుగదల కనిపించింది.
విభాగం 2015 2016 పెరిగిన శాతం(%)
మూలమూర్తి దర్శనం 5.75లక్షలు 7.99లక్షలు 38.85 శాతం
హుండీ కానుకలు (రూ.) 17.37 కోట్లు 22.96 కోట్లు 32.20శాతం
లడ్డూ ప్రసాదాల అమ్మకం 24.82లక్షలు 33.91 లక్షలు 36.63శాతం
అన్నప్రసాదం 14.89 లక్షలు 24.59 లక్షలు 65.11శాతం
తలనీలాలు 2.72 లక్షలు 3.83 లక్షలు 40.75శాతం
రిసెప్షన్ ఆదాయం(రూ.) 1.44 కోట్లు 1.87 కోట్లు 29.59శాతం
వైద్యసేవలుపొందిన భక్తులు 52,170 67,821 30 శాతం
ప్రచురణల అమ్మకం(రూ.) 3.70లక్షలు 64.87 లక్షలు 16.53శాతం
నీటి వినియోగం(లక్షల గ్యాలన్లు) 281.7 338.12 20.03శాతం
తిరుపతి నుండి ఆర్‌టీసీ ప్రయాణికులు 3.75లక్షలు 4.98 లక్షలు 32.58శాతం
తిరుమల నుండి ఆర్‌టీసీ ప్రయాణికులు4.95లక్షలు 6.95 లక్షలు 40.19శాతం