ఒంగోలు: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుతో తనకు సంబంధం లేదని చెప్పినా కూడా తప్పుడు ట్వీట్లు పదే పదే చేసిన వారు, వాటిని ప్రసారం చేసిన చానళ్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జూలై 14న తమిళనాడు ఎలపూరు చెక్‌పోస్టు వద్ద ఓ కారులో పట్టుబడిన నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పజెప్పిన సంగతి విదితమే. అయితే ఆ కారుపై ఆంధ్రప్రదేశ్ ఎంఎల్‌ఏ స్టిక్కర్ ఉండటంతో తమిళ, కొన్ని తెలుగు మీడియా వారు డబ్బుతో తనకు సంబంధం ఉందనుకున్నారని, ఆ విషయాన్ని ఖండిస్తూ పూర్తిస్థాయి విచారణకు తాను సిద్ధం అని అన్ని మీడియాలకు సందేశాన్ని పంపానని మంత్రి పేర్కొన్నారు.
కానీ టీవీ 5 చానల్, టీడీపీ నేతలు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు. నారా లోకేష్ తనపై తప్పుడు ట్వీట్లు చేస్తే.. వాటిని టీవీ 5 పదేపదే ప్రచారం చేసిందన్నారు. లాయర్ నోటీసులను లోకేష్, బోండా ఉమా, బొల్లినేని రాజగోపాల్‌నాయుడు, రవీంద్రనాథ్, సాంబశివరావు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, న్యూస్18, టీవీ5 చానళ్లకు పంపించారు.
క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు
Published Sat, Aug 22 2020 4:45 AM | Last Updated on Sat, Aug 22 2020 4:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment