వీడు మాయగాడు | FAKE INCOMETAX OFFICER | Sakshi
Sakshi News home page

వీడు మాయగాడు

Published Sun, Aug 7 2016 9:49 AM | Last Updated on Thu, Sep 27 2018 4:24 PM

వీడు మాయగాడు - Sakshi

వీడు మాయగాడు

ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారినంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద నగదు వసూలు
పోలీస్‌స్టేషన్‌లోనే నివాసం.. అక్రమ వసూళ్లకు ఏకంగా ఖాకీల జీపే వినియోగం
సర్పంచుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
కేటుగాడిది వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం 

గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో కస్టమ్స్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారినంటూ తిరుగుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నకిలీ అధికారిని పోలీసులు శనివారం అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన పసుపుల ర ఫీ గిద్దలూరులో కొందరు పోలీసు అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారినంటూ కొందరికి, కస్టమ్స్‌ అధికారినంటూ మరికొందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో వాహనాల్లో తిరుగుతూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కాంట్రాక్టర్లు, అధికారుల వద్ద అందిన కాడికి దండుకున్నాడు.కొందరు సర్పంచుల వద్ద రూ.10 వేలు చొప్పున వసూలు చేశాడు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, నగర పంచాయతీ, ఇరిగేషన్, పోలీసు అధికారుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వని ప్రజాప్రతినిధులు, అధికారులపై బెదిరింపులకు దిగాడు. 
 
పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచులు
అనుమానం వచ్చిన కొందరు సర్పంచులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే పోలీసుస్టేçÙన్‌లో ఉన్న ర ఫీని సీఐ ఫిరోజ్‌ అదుపులోకి తీసుకుని ఖాకీ రుచి చూపించారు. ఎన్‌ఎస్‌ఎస్‌లో శిక్షణ పొందానని, మరి కొన్ని రోజులు గిద్దలూరులో ఉంటానంటూ వచ్చిన ర ఫీ పోలీసులతో తిరుగుతూ వాహనాల తనిఖీలు చేసేవాడని తెలుస్తోంది.
 
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కోసం వెళ్తున్నానని నెల రోజులు ర ఫీ ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత గిద్దలూరు వచ్చి తనకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా ఉద్యోగం వచ్చిందంటూ ప్రచారం చేసుకున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ నగదు వసూళ్లకు పాల్పడ్డాడు. ఏడాదిన్నరగా పోలీసుస్టేçÙన్‌లోనే నివాసం ఉన్నాడు. ఏకంగా పోలీసు వాహనంలోనే తిరుగుతూ అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్ద దర్జాగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. మండలంలోని కంచిపల్లెకు చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement