సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కొత్త హెల్ప్ లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇ-ఫైలింగ్ కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లను మారుస్తున్నామంటూ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇ-ఫైలింగ్( ఆన్‌లైన్ ద్వారా) పన్ను వివరాలను నమోదు చేసుకునే వారి కోసం ఆదాయపన్ను శాఖ కొత్త హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది. అడ్వైజరీ ద్వారా ఐటీశాఖ నేడు కొత్త నెంబర్లతో ఈ ప్రకటన జారీ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్18001030025, డైరక్ట్ నెంబర్ 918046122000 కొత్త నెంబర్లు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటాయని ఐటీశాఖ వెల్లడించింది.
https://www.incometaxindiaefiling.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా పన్నుదారులు తమ పన్నులకు సంబంధించిన అంశాలను ఈ-ఫైయిలింగ్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం దాఖలు సందర్భంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించ వచ్చని సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment