E filing
-
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే?
Income Tax Return Guide : ఏ కారణం వల్లనైనా కానివ్వండి, ఇంకా మీరు మీ ఆదాయాన్ని డిక్లేర్ చేయలేదా.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయలేదా? గడువుతేదీని పొడిగిస్తారని ఎదురు చూసి నిరాశ చెందారా? గాభరా పడకండి. ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లోపల రిటర్ను దాఖలు చేయని వారికి కొంత జరిమానా కడితే మరో ఐదు నెలల వ్యవధి దొరుకుతుంది. జూలై 31లోపు వేయని వారికి రాబోయే 5 నెలల్లో ఎప్పుడు రిటర్ను దాఖలు చేసినా జరిమానా మొత్తం మారదు. దీనికి గడువు తేదీ 31–12–2023. మీ నికర ఆదాయం రూ. 5,00,000 లోపు అయితే రూ. 1,000; నికర ఆదాయం రూ. 5,00,000 దాటితే రూ. 5,000 జరిమానాగా చెల్లించేందుకు మీరు సన్నద్ధం అయితే మీరేమీ గాభరా పడక్కర్లేదు. అలా అని 5 నెలల దాకా పొడిగించకండి. నెల మారుతున్న కొద్దీ ఇతర వడ్డీలు పెరుగుతుంటాయి. మీ నికర ఆదాయం మీకు వర్తించే బేసిక్ లిమిట్ దాటకపోతే, అసలు రిటర్ను వేయనవసరం లేదు. మీ వయస్సుని బట్టి మీ బేసిక్ లిమిట్ మారుతుంది కదా. అయితే, మీ కేసులో ఏదైనా టీడీఎస్ ఉంటే, ఆ మొత్తాన్ని రీఫండుగా మీరు పొందుదామనుకుంటే, ఆదాయంతో నిమిత్తం లేకుండా రిటర్ను వేయండి. అతి తక్కువ టీడీఎస్ ఉంటే, దాని మీద ఎటువంటి ఆశ లేకుండా రిటర్ను వేయడం తప్పించుకునే ధన్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్ని వివరాలు సేకరించండి. కాగితాలు, రుజువులు, ధృవీకరణలు, సర్టిఫికెట్లు మొదలైనవి సంపాదించండి. ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త తీసుకోండి. వెబ్సైటులోని ఫారం 16, 16 అ, అ 26 మొదలైనవి డౌన్లోడ్ చేయండి. వీటిలో సమగ్ర సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని చెక్ చేసుకోండి. సర్వసాధారణంగా వీటిలో తప్పులుండవు. నిజంగా తప్పేదైనా దొర్లి ఉంటే మీరు వాటిని విభేదించవచ్చు. కానీ, త్వరలో రాబోయే నోటీసుకి, ఆ భేదం లేదా తేడాను రుజువులతో, వివరణలతో, సంజాయిషీతో డిపార్టుమెంటు వారికి చెప్పాలి. మనం చాలా చోట్ల, చాలా సందర్భాల్లో మన పాన్ని తెలియపరుస్తాము. అటు పక్క వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు తప్పులు జరగవచ్చు. రిటర్నులు వేయని వారికి నష్టాల సర్దుబాటు ఉండదు. దాని వల్ల ఎంతో నష్టం ఉందండి. మిగతా వడ్డీలు వడ్డిస్తారు. రిఫండు మీద వడ్డీ ఇవ్వరు. ఇలాంటివి ఇంకా ఎన్నో. సకాలంలో ఐటీ రిటర్ను వేసినంత సుఖం లేదు. ఇదే, మీ అనారోగ్యం, భయం, మానసిక ఆందోళన, ఒత్తిడి, బెంగ, బాధను తగ్గించేది. కాబట్టి ఇప్పటికైనా రిటర్ను వేయండి. ఇదీ చదవండి ➤ గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది? -
ష్..కథ మళ్లీ మొదటికొచ్చింది, ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు!
కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని, త్వరగా ఈ -ఫైలింగ్ చేయలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే ఆ సమస్యని పరిష్కరించాలంటూ ట్యాక్స్ పేయర్స్ ఐటీ డిపార్ట్మెంట్ను కోరారు. దీనిపై ఐటీ డిపార్ట్ మెంట్ స్పందించింది. జులై 2న(శనివారం) ట్యాక్స్ చెల్లించేందుకు ట్యాక్స్ పేయిర్స్ ఇన్ కం ట్యాక్స్‌కు చెందిన వెబ్‌సైట్‌ను లాగిన్ అయ్యారు. ఆ సమయంలో పోర్టల్ పనితీరు స్తంభించింది.ఈ ఫైలింగ్ చేసినా అప్రూవల్ వచ్చేందుకు సమయం పట్టింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన యూజర్లు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు.పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని సంబంధి శాఖకు మెయిల్స్ పెట్టారు. It has been noticed that taxpayers are facing issues in accessing ITD e-filing portal. As informed by @Infosys, they have observed some irregular traffic on the portal for which proactive measures are being taken. Some users may be inconvenienced, which is regretted. — Income Tax India (@IncomeTaxIndia) July 2, 2022 "ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదుతో కేంద్రానికి చెందిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు.. ఆ పోర్టల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్‌కు తెలిపినట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు ట్యాక్స్ పేయర్స్ ఐటీడీ ఈ- ఫైలింగ్ పోర్టల్‌తో ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులకు మేం చింతిస్తున్నాం". అంటూ ఇన్ కం ట్యాక్స్ ఇండియా ట్విట్లో పేర్కొంది. pic.twitter.com/GBdX7nhxKu — Yogesh Thombre (@YogsThombre7177) July 2, 2022 గతంలో పలు మార్లు ఐటీ శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్ లాంచ్ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్ రిటర్న్ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్ పేయర్స్, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు.. మళ్లీ మళ్లీ అదే పొరపాటా..
న్యూఢిల్లీ: ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం కొత్త పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి మంగళవారానికి ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా అదే సమయానికి మళ్లీ సమస్యలు తలెత్తడం గమనార్హం. పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని, సెర్చ్ ఆప్షన్ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురై ఉంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను రూపొందించిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ విభాగం పేర్కొంది. హ్యాక్ కాలేదు ‘ఈ–ఫైలింగ్ వెబ్సైట్లో సెర్చ్ ఆప్షన్ పనితీరుకి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వచ్చాయి. పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌కు సూచించాము. సమస్య సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్ఫీ కూడా తెలిపింది‘ అని ఐటీ విభాగం మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని, డేటా చౌర్యమేమీ జరగలేదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ట్యాక్స్ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా ఏడాది పన్ను రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసే ఉద్దేశ్యంతో కొత్త పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్టును ఇన్ఫోసిస్ 2019లో దక్కించుకుంది. దీన్ని 2021 జూన్ 7న ఆవిష్కరించారు. కానీ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచీ అనేక సందర్భాల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ట్యాక్స్ రిటర్నుల దాఖలు గడువును కూడా ప్రభుత్వం పొడగించాల్సి వచ్చింది. చదవండి: తగ్గేదేలే అంటున్న ఇన్ఫోసిస్.. ఏం జరగబోతోంది? -
ఒక్కరోజులో 24.39 లక్షలు.. ఒక్క గంటలో 2.79 లక్షలు.. ఐటీ ఫైలింగ్‌లో రికార్డ్ !
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు విషయంలో డిసెంబరు 30న రికార్డు చోటు చేసుకుంది. ఐటీ రిటర్న్స్‌కి చివరి తేదీ సమీపించడంతో భారీ స్పందన వచ్చింది. డిసెంబరు 30వ తేదిన ఒక్క రోజులేనే దేశవ్యాప్తంగా 24.39 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. ఇందులో చివరి గంటలో ఏకంగా అయితే 2.79 లక్షల ఫైళ్లు దాఖలయినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2021 డిసెంబరు 30 ఇప్పటి వరకు మొత్తం 5.34 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. కాగా డిసెంబరు 31తో ఐటీ దాఖలకు గడువు ముగిసిపోతుంది. More than 5.34 crore Income Tax Returns for AY 2021-22 filed till 8pm today. This includes 24.39 lakh #ITRs filed today itself with 2.79 lakh #ITRs filed in the last one hour. Hope you have filed yours too! If not, please file by the due date ie 31st December, 2021. — Income Tax India (@IncomeTaxIndia) December 30, 2021 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని హామీలు ఇచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్‌లో సమస్యలు తొలగిపోవడం లేదు. పదే పదే సాంకేతిక సమస్యలు (ఎర్రర్స్) ఎదురవుతున్నాయి. చివరి తేది సమీపించడంతో భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ కోసం ఈ ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యారు. వీరిలో చాలా మంది టెక్నికల్ గ్లిచెస్తో తాము విసిగిపోయామంటూ ట్వీట్లు చేశారు. Tax filing deadline and #CAs erupting in anger about @Infosys and #TaxPortal. Most are great devotees of @narendramodi Is @FinMinIndia @nsitharaman listening?? A tax portal that doesn't work despite public admonishment @NandanNilekani https://t.co/5MvAo2qetG — Sucheta Dalal (@suchetadalal) December 30, 2021 చదవండి:జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి -
విదేశాల్లో ఉన్నారు.. ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా. రిటర్న్ వేయకుండా ఉంటే పెన్షన్ ఉండదంటున్నారు చాలా మంది. – కే.యస్. చైతన్య, హైదరాబాద్ రిటర్నులు వేయకపోతే ఎటువంటి నోటీసులు రావు అని, ఎవరికీ తెలియదు అని.. ఏమీ అడగరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అపోహ మాత్రమే. ఈ వాదనలో ఎటువంటి పసలేదు. చట్టరీత్యా మీకు ట్యాక్సబుల్ ఇన్‌కం దాటి ఆదాయం ఉంటే, మీరే స్వంతంగా రిటర్న్ దాఖలు చేయాలి. అది మీ విధి. కర్తవ్యం. పరోక్షంగా మీరు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారన్న మాట. మనం కట్టే పన్నుల్లో నుంచే దేశాభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఇది మీ స్టేటస్ సింబల్ .. గౌరవం కూడా. అటు పైన మీరు రుణం తీసుకోవాలన్నా బ్యాంకర్లు, ఇతరులు.. అందరూ అడిగే మొట్టమొదటి డాక్యుమెంట్ మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నే. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు చేయాలంటే పాన్ ఉండాల్సిందే. బ్యాంకు అకౌంట్ తెరవాలంటే పాన్ ఉండాలి. విదేశీయానానికి కావాల్సిన వీసా తీసుకోవడానికి వెళ్లాలన్నా ఈ డాక్యుమెంట్లు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారం, వృత్తి చేయాలంటే, స్థిరాస్థుల క్రయవిక్రయాల్లో, ఇన్సూరెన్స్‌లో, ఇన్వెస్ట్మెంట్లలో .. ఇలా ఎన్నో రోజువారీ కార్యకలాపాలకు పాన్ తప్పనిసరి. కాబట్టి రిటర్ను వేయడం మానేయడం కన్నా వేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మా అత్తగారు, మావగారు ప్రస్తుతం మాతో అమెరికాలో ఉన్నారు. వచ్చే జనవరి వరకు భారత్‌కి రారు. గడవు తేదిలోగా రిటర్ను వేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి – పాలగుమ్మి అరుణ, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) మీ అత్తగారు, మావగారి దగ్గర ఆదాయానికి సంబంధించి పూర్తి సమాచారం సిద్ధంగా ఉంటే మీరు అక్కడి నుంచే ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనినే ఈ–ఫైలింగ్ అంటారు. ఇది సులువు. త్వరగా అవుతుంది. కష్టపడక్కర్లేదు. డిపార్ట్మెంట్ వీటిని త్వరితగతిన ప్రాసెసింగ్ చేస్తారు. సెప్టెంబర్ 2021లో వేసినవారికి అక్టోబర్‌లో రిఫండ్లు వచ్చాయి. ప్రస్తుతం గడువు తేది 31–12–2021. వారు భారత్ వచ్చే దాకా ఆగకండి. ఇక్కడికి వచ్చి, ఇక్కడే వేయనవసరం లేదు. వేచి ఉండక్కర్లేదు. ఈ లోగా సమగ్ర సమాచారం సేకరించలేకపోతే డిసెంబర్ తర్వాత వేయండి. వడ్డీ, పెనాల్టీలు పడతాయి. నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. నా సేవింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఫారం 16 జారీ చేశారు. అలాగే ఫారం 26 అ లో తప్పులున్నాయి. రివైజ్ చేయడానికి సంస్థ ముందుకు రావడం లేదు. – సామవేదం లావణ్య, సికింద్రాబాద్ ఈ విషయం గతంలో ఎన్నో సార్లు ప్రస్తావించాం. ఎన్నో సంస్థలు ఫారం 16, ఫారం 16 అల జారీలో తప్పులు చేస్తున్నాయి. ఫారం 26 అ లో కూడా తప్పులు దొర్లుతున్నాయి. మీ దగ్గరున్న సమాచారం సరైనది, సమగ్రమైనది అయితే, తగిన కాగితాలు ఉంటే, ఆ మేరకు రిటర్నులు వేసినప్పుడు సరిదిద్దండి. సరిగ్గా వేయండి. ఎటువంటి సమస్యా ఉండదు. అవసరం అయినప్పుడు సమీక్షించుకోవాలి - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు 12 గంటల అంతరాయం
ఆదాయ పన్నుల కొత్త వెబ్ పోర్టల్‌కు అంతరాయం కలగనుంది. నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా సైట్ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుందని . శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్సైటు https:///www.incometax.gov.in ద్వారా తెలియజేసింది. ఈ పన్నెండు గంటలపాటు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు. అలాగే ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇక వెబ్సైటులో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం విదితమే. కొత్త పోర్టల్‌ను ఈ ఏడాది జూన్‌లో పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్లో పేర్కొంది. -
హైకోర్టులో ఈ–ఫైలింగ్‌కు మార్గదర్శకాలివీ..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రరూపంలో ఉన్న నేపథ్యంలో హైకోర్టు అతి ముఖ్యమైన కేసుల నమోదుకు, విచారణ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ–ఫైలింగ్ విధానాలను తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా... ►అత్యవసర కేసులను దాఖలు చేసే న్యాయవాదులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ–మెయిల్ ద్వారా పంపాలి. కేసుకు సంబంధించిన అన్ని పత్రాల పైన న్యాయవాది, పిటిషనర్లు సంతకాలు చేయాలి. ►అలా చేసిన పిటిషన్‌ను పీడీఎఫ్ రూపంలో ఈ మెయిల్ చేయాలి. అదే ఈమెయిల్లో కేసు దాఖలు చేసిన న్యాయవాది, పిటిషనర్ పేర్లు, న్యాయవాది కోడ్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సెల్ ఫోన్ నంబర్లను కూడా పంపాలి. ►ఇలా దాఖలయ్యే పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పరిశీలించి విచారణయోగ్యమైన వాటిని ఎంపిక చేస్తారు. విచారణ చేయాలని నిర్ణయించిన కేసుల గురించి, విచారణ జరిపే తేదీ తదితర సమాచారాన్ని న్యాయవాది మొబైల్ నెంబర్‌కు మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ►విచారణ చేయాలని నిర్ణయించిన కేసుల్లో న్యాయవాది లేదా పిటిషనర్ వారిళ్ల వద్ద నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించాలి. ఈ విధంగా చేసేందుకు వీలుకాకపోతే బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం పక్కన మూడో క్వార్టర్లోని కంట్రోల్ రూం నుంచి వాదనలు వినిపించవచ్చు. ►వీడియో కాన్ఫరెన్స్ కోసం న్యాయవాది లేదా పిటిషనర్ ‘జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. న్యాయవాది లేదా పిటిషనర్ ఫోన్‌కు లింక్ అందాక కోర్టు హాలుతో అనుసంధానం అయ్యాక వాదనలు వినిపించాలి. ►ఇరుపక్షాల వాదనల తర్వాత కోర్టు రూంలోని కోర్టు మాస్టర్‌కు న్యాయమూర్తులు ఉత్తర్వులు చెబుతారు. ఆ ఉత్తర్వుల ప్రతిపై న్యాయమూర్తితోపాటు హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ సంతకాలు చేశాక హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ►దీనినే హైకోర్టు ఉత్తర్వులుగా పరిగణించాలి. సాంకేతిక సమస్యలు వస్తే హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)కు ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ►కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన ఈ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాక పిటిషనర్లు, ప్రతివాదులు తమ వాదప్రతివాదనల ప్రతులను హైకోర్టుకు ఇప్పుడున్న విధానంలో అందజేయాలి. ►కేసులు పరిష్కారం అయినా, అవ్వకపోయినా వాటికి చెందిన పత్రాలను హైకోర్టులోని ఫైలింగ్ విభాగంలో దాఖలు చేయాలి. ►ఈ–ఫైలింగ్‌కు హైకోర్టు కేటాయించిన మెయిల్ ఐడీ ట్ఛజ.జ్ఛn్టటజిఛిః్చజ్జీ.జౌఠి.జీnకు వివరాలు పంపాలి. -
ఆదాయ, ఖర్చుల నమోదుకే ఈ–ఫైలింగ్
నిడమర్రు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయం, ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడం కోసం ఉద్దేశించిన విధానమే ‘ఈ–ఫైలింగ్’. పన్ను వర్తించే ఆదాయం ఉన్నవారు జులై 31లోగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలలో సమర్పించిన ఫారం–16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ–ఫైలింగ్‌ను పాన్ కార్డు నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈ–ఫైలింగ్ ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖకు సులభంగా తెలిపేందుకు ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొనవచ్చు. ఈ–ఫైలింగ్‌కు సంబంధించి ముఖ్య సమాచారం తెలుసుకుందాం. జులై 31వ తేదీలోపు ⇔ ఈ–ఫైలింగ్ ఈ ఏడాది జులై 31లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా పర్సనల్ ఈ–ఫైలింగ్ చేసుకోవచ్చు. ⇔ ఒకవేళ ఉద్యోగుల ఆదాయం మొత్తం రూ.5 లక్షల లోపు ఉండి ఈ–ఫైలింగ్ గడువులోగా చేయకపోతే రూ.వెయ్యి లేట్ ఫైలింగ్ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ⇔ ఆదాయ రూ.5 లక్షలు దాటి డిసెంబర్ 31 వరకూ ఈ–ఫైలింగ్ చేయకపోతే రూ.5 వేలు, డిసెంబర్ 31 తర్వాత రూ.10 వేలు లేట్ ఫైలింగ్ పెనాల్టీ చెల్లించాలి. లేట్ ఫైలింగ్ పెనాల్టీ చెల్లించకుండా 2018–19 పర్సనల్ ఈ–ఫైలింగ్ చేయడం కుదరదని గమనించండి. ⇔ 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఈ–ఫైలింగ్ చేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా ఫైలింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. వెంటనే ఈ సౌకర్యం వినియోగించుకోవడం మంచిది. ఈ–ఫైలింగ్‌కి కావాల్సినవి ⇔ సంబంధిత సంవత్సరం ఫారం–16, పాన్ కార్డు, ఆధార్ కార్డు, శాలరీ అకౌంట్ నంబర్, ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, ఈ–మెయిల్ ఐడీ, సెల్ నంబర్ (ఈ రెండు ఓటీపీ కోసం తప్పనిసరి). ఈ–ఫైలింగ్‌తో ఉపయోగాలు ⇔ తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యే ప్రతి మొత్తానికి ట్యాక్స్ చెల్లించనవసరం ఉండదు. ⇔ ఉద్యోగులు నెలవారి చెల్లించే అడ్వాన్స్ ఆదాయ పన్ను వల్ల క్వార్టర్లో చెల్లించాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ/తక్కువ చెల్లించినవారికి ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులు రావు. ⇔ ట్యాక్స్ ఎక్కువ చెల్లించినవారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది. ⇔ డీడీవోలు తమ ఉద్యోగులు నెలవారీగా చెల్లిం చిన అడ్వాన్స్ ట్యాక్స్‌ను ప్రతి క్వార్టర్లో టీడీఎస్ అప్డేట్ చేయించుకుంటూ ఉండాలి. అలా చేయని డీడీవోలకు రోజుకు రూ.200 ఆపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. పేరు రిజిస్టర్ చేసుకొనుట ⇔ http://incometaxindiaefiling.gov.in/home అనే వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అను ఆప్షన్‌ను ఎంచుకొనాలి. దానిలో పాస్వర్డ్ తదితర వివరాలను పూర్తిచేసిన తదుపరి మొబైల్‌కి వచ్చిన పిన్ నంబర్‌ను నమోదు చేస్తే రిజిస్ట్రేన్ పూర్తయినట్టే. మీ పాస్‌వర్డ్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ⇔ తర్వాత ఫారం 26ఏఎస్ ఓపెన్ చేసుకుని ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదైనదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఈ ఫారంలో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఈ–రిటర్న్ చేయాలి. ⇔ ఈ–ఫైలింగ్ పూర్తయ్యాక ఐటీఆర్–1 సబ్మిట్ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ ఆప్షన్ వస్తాయి. ఎక్నాలెడ్జ్మెంట్ కాపీని బెంగుళూరుకు పంపాల్సింది లేనిదీ ఎక్నాలెడ్జ్మెంట్ కింది భాగంలో పేర్కొంటుంది. పంపాల్సి వస్తే సంతకం చేసి 3 నెలలలో పంపించాలి. -
అటెన్షన్ టాక్స్ పేయర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కొత్త హెల్ప్ లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇ-ఫైలింగ్ కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లను మారుస్తున్నామంటూ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇ-ఫైలింగ్( ఆన్లైన్ ద్వారా) పన్ను వివరాలను నమోదు చేసుకునే వారి కోసం ఆదాయపన్ను శాఖ కొత్త హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది. అడ్వైజరీ ద్వారా ఐటీశాఖ నేడు కొత్త నెంబర్లతో ఈ ప్రకటన జారీ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్18001030025, డైరక్ట్ నెంబర్ 918046122000 కొత్త నెంబర్లు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటాయని ఐటీశాఖ వెల్లడించింది. https://www.incometaxindiaefiling.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా పన్నుదారులు తమ పన్నులకు సంబంధించిన అంశాలను ఈ-ఫైయిలింగ్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం దాఖలు సందర్భంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించ వచ్చని సీనియర్ అధికారి తెలిపారు. -
మార్పునకు నాంది... ఈ–అసెస్మెంట్లు
2006 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులను ఈ–ఫైలింగ్ ద్వారా చేయాలి. జనాలు అలవాటు పడ్డారు. అది సజావుగానే సాగుతోంది. 10 సంవత్సరాల తర్వాత అంటే 2016లో ఈ–అసెస్మెంట్లకు నాంది పలికారు. మామూలు అసెస్మెంట్లో అధికారులు నోటిసులిస్తారు. బదులుగా మనం అధికారులను కలిసి వారు అడిగిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలి. అంతేకాక అకౌంట్స్ బుక్స్, పాస్‌బుక్‌లు, రుజువులు, ధ్రువీకరణ పత్రాలు, అగ్రిమెంట్లు ఇలా సవాలక్ష కాగితాలు అందివ్వాలి. వారు రమ్మన్నప్పుడు వెళ్లాలి. చాలా సార్లు కలవాలి. వివరణలివ్వాలి. ఎంతో కాలం, ప్రయాస, వెళ్లి రావడానికి రవాణా ఖర్చులు, నిరీక్షణ, వాదోపవాదాలు, అధికారులు అదిరింపు, అసెసీ భయపడటం, ఒక్కొక్క కేసుకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్న కాగితాల కట్టల గుట్టలు.. ఇలా ఎన్నో. సవ్యంగా సాగితే సవరణ, వివరణ ఉంటాయి. లేదంటే రణమే. వీటన్నింటికీ మించి వ్యక్తిగత అభిప్రాయం, అభిమానం, అనుమానం ఎక్కువ పాత్ర పోషిస్తాయి. వీటి ప్రభావం ఆదాయపు పన్ను భారంపై పడుతుంది. మంచి లేకపోలేదు. అధికారులు ఓపికగా ఉంటారు. ఇబ్బందులు వింటారు. సకాలంలో కాగితాలు ఇవ్వకపోతే తగిన కారణం ఉంటే సహకరిస్తారు. మానవతా దృక్పథం ఉంటుంది. అర్థం చేసుకుంటారు. సర్దుబాటు, దిద్దుబాటు, వెసులుబాటు ఉంటాయి. ఇలా గత 50 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో... ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వస్తున్నాయి ఈ–అసెస్మెంట్లు. ఈ–ప్రోసీడింగ్స్‌లో నోటీసులు, ప్రశ్నలు ఉంటాయి. మొబైల్ ఫోన్‌కి సంక్షిప్త సమాచారం ఇస్తారు. స్క్రూటినీ పాక్షికమా, సమగ్రమా తెలియజేస్తారు. అయితే అసెసీకి ఒక అవకాశమిస్తారు. ఇక్కడ మాన్యువల్ లేదా ఈ–అసెస్మెంట్ అనేది మన ఇష్టం. మీరు ఇవ్వాల్సిన సమాచారం ఈ–మెయిల్ ద్వారా ఇవ్వాలి. అది 10 మెగాబైట్స్ దాటకూడదు. ఎప్పటికప్పుడు మై అకౌంట్లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. మెయిల్స్ ఓపెన్ చేసి సమాధానమివ్వాలి. అధికారులకు తగిన సమాచారం లభించిన తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత ఆర్డర్లు ఈ–మెయిల్ ద్వారా వస్తాయి. ఇది పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి జరిగే ప్రక్రియ. మీ కాగితాల్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది. మీ కాగితాలే మాట్లాడతాయి. మీ మాట ఎవ్వరూ విన్నరు. మిమల్ని ఎవ్వరూ చూడరు. వయోవృద్ధులకు ఇది శరఘాతం. కాగితాల్లో తప్పు చోటుచేసుకుంటే అసెస్మెంట్ తప్పవుతుంది. సర్దుబాటుకు అవకాశం లేదు. వ్యక్తిగత విచారణ ఉండదు. డిజిటలైజేషన్ జిందాబాద్ అక్షరాస్యతలో వెనకున్నాం. ఈ టెక్నాలజీతో పరిగెత్తగలమా? అధికారులకిది కొత్తే. అసెసీలకు వింత. కొత్తపొంతలు తొక్కేటప్పుడు వెసులుబాటు, సర్దుబాటు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కేవలం రికార్డుల ప్రకారం జరిగే ప్రక్రియ కాదు. ప్రతి దాన్నీ కాగితాలతో, రుజువులతో బేరీజు వేయకూడదు. కాగితం అంటే చట్టం. కానీ న్యాయం, ఔచిత్యం చూడాలి. ఎందుకంటే కాగితాలకందని ఎన్నో విషయాలుంటాయి. ఖర్చు స్వభావం, ప్రయోజనం, వాస్తవికత, నిజాయితీ, వర్తింపు, న్యాయం, విశ్వసనీయత, ఉద్దేశం వీటన్నింటిలో అధికారులు సంతృప్తి చెందాలి. విటన్నింటికీ మానవ దృక్పథం వెన్నెముకలాగా ఉంటుంది. మొదట్లో ఇబ్బందులు ఉన్నా ఇరువురి సహకారంతో ముందుకు వెళ్లొచ్చు. విద్యతో నిమిత్తం లేకుండా కొన్ని కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు. ఈ పేమెంట్లు చేస్తున్నారు. మార్పుకి ఓటేస్తున్నారు. మంచి ఫలితానిచ్చే ఏ మార్పునైనా ప్రజలు మన్నించక తప్పదు. -
కలెక్టర్ కొరడా
ఏలూరు సిటీ : కలెక్టర్ కె.భాస్కర్ వ్యవహార శైలి ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణ ఎదుర్కొన్న ఒక వీఆర్వోను ఇటీవల తన కార్యాలయానికి పిలిపించుకుని అతడికి లంచంగా రూ.5 వేలు ఇచ్చిన కలెక్టర్.. తాజాగా ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ తెరిచి వెళ్లిన ఉద్యోగి పేరిట ఆన్లైన్లో రాజీనామా లేఖ సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలతోపాటు సర్వశిక్ష అభియాన్, డీఈవో, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–ఫైలింగ్ విధానం అమలుపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.విజయలక్ష్మి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె పేరిట కలెక్టర్ లేఖ రాసి దానిని తక్షణమే ఆమోదించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆన్లైన్లో పంపించారు. జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి శుక్రవారం సెలవు పెట్టారు. కలెక్టర్ ఆ కార్యాలయాన్ని తనిఖీ చేస్తుండగా.. విజయలక్ష్మికి ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ, మెయిల్ ఐడీ తెరిచి ఉండటాన్ని గమనించారు. సెలవులో ఉండి డిజిటల్ కీ ఎలా తెరిచి వెళ్లారని ప్రశ్నిం చారు. విజయలక్ష్మి మెయిల్ ఐడీ నుంచి ఆమె పేరిట రాజీనామా లేఖను కలెక్టర్ స్వయంగా కంపోజ్ చేసి ఆన్లైన్లో జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించారు. ఆ సమయంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె వచ్చాక.. విజయలక్ష్మి రాజీనామా లేఖను తనకు ఆన్లైన్లో పంపాలని జాయింట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. ఈ ఫైలింగ్‌లో నిర్లక్ష్యంపై ఆగ్రహం ఈ–ఫైలింగ్ విధానంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కనీసం ఫైల్ ఎలా తయారు చేయాలో సిబ్బందికి అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇలా అయితే భవిష్యత్‌లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని జేడీ వై.సాయిలక్ష్మీశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వశిక్షాభియాన్ జిల్లా కార్యాలయం ఆర్థిక విభాగంలో నలుగురు పనిచేస్తుంటే ఒకేసారి ఇద్దరు సెలవుపెడితే ఎలాగంటూ పీవో బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు కార్యాలయంలోని బీరువాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతే ఎలాగని నిలదీశారు. డీఈవో కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన తలుపుల నిండా ఉద్యోగ సంఘాల క్యాలెం డర్లు అతికించి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.72 లక్షలతో నిర్మించిన డీఈవో కార్యాలయ నూతన భవనాన్ని పరిశీ లించారు. ఇతర నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని ఏడాది నుంచి చెబుతున్నా పాత విధానాన్ని అమలు చేస్తున్న ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. -
ఈ ఫైలింగ్ ద్వారా అఫిడవిట్లు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము సమర్పించే అఫిడవిట్లను ఇక నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ ఫైలింగ్ ద్వారా సమర్పించడానికి కూడా తొలిసారిగా అవకాశం కల్పించారు. అభ్యర్థులు తాము నామినేషన్ దాఖలు చేసేప్పుడు నేర చరిత్ర, కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వంటి అంశాలపై ప్రత్యేకంగా అఫిడవిట్లు సమర్పిస్తారు. అరుుతే వీరు ఇప్పటివరకు నోటరీ చేయించిన అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. తాజాగా ఈ ఫైలింగ్ ద్వారా ఆన్లైన్లో సమర్పించే వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు సమాచారమిచ్చింది. ఈ అఫిడవిట్లను ఇంగ్లీషులో లేదా హిందీలో మాత్రమే సమర్పించడానికి వీలుంది. అఫిడవిట్లలోని ఏ కాలమ్‌నూ ఖాళీగా వదిలివే సేందుకు వీల్లేదు. తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే ఈసీ ఇందుకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ అసంపూర్తి అఫిడవిట్లను ఆమోదించదు. అప్పుడు సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థి ఏదైనా సమాచారం దాచిపెడితే ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించవచ్చన్న సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వుల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.