కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని, త్వరగా ఈ -ఫైలింగ్ చేయలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే ఆ సమస్యని పరిష్కరించాలంటూ ట్యాక్స్ పేయర్స్ ఐటీ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. దీనిపై ఐటీ డిపార్ట్ మెంట్ స్పందించింది.
జులై 2న(శనివారం) ట్యాక్స్ చెల్లించేందుకు ట్యాక్స్ పేయిర్స్ ఇన్ కం ట్యాక్స్‌కు చెందిన వెబ్‌సైట్‌ను లాగిన్ అయ్యారు. ఆ సమయంలో పోర్టల్ పనితీరు స్తంభించింది.ఈ ఫైలింగ్ చేసినా అప్రూవల్ వచ్చేందుకు సమయం పట్టింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన యూజర్లు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు.పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని సంబంధి శాఖకు మెయిల్స్ పెట్టారు.
It has been noticed that taxpayers are facing issues in accessing ITD e-filing portal. As informed by @Infosys, they have observed some irregular traffic on the portal for which proactive measures are being taken. Some users may be inconvenienced, which is regretted.
— Income Tax India (@IncomeTaxIndia) July 2, 2022
"ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదుతో కేంద్రానికి చెందిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు.. ఆ పోర్టల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్‌కు తెలిపినట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు ట్యాక్స్ పేయర్స్ ఐటీడీ ఈ- ఫైలింగ్ పోర్టల్‌తో ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులకు మేం చింతిస్తున్నాం". అంటూ ఇన్ కం ట్యాక్స్ ఇండియా ట్విట్‌లో పేర్కొంది.
— Yogesh Thombre (@YogsThombre7177) July 2, 2022
గతంలో పలు మార్లు
ఐటీ శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్ లాంచ్ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్ రిటర్న్ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్ పేయర్స్, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment