ఆదాయ పన్నుల కొత్త వెబ్ పోర్టల్‌కు అంతరాయం కలగనుంది. నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా సైట్ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుందని . శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్‌సైటు https:///www.incometax.gov.in ద్వారా తెలియజేసింది.
ఈ పన్నెండు గంటలపాటు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు. అలాగే ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇక వెబ్‌సైటులో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం విదితమే.
కొత్త పోర్టల్‌ను ఈ ఏడాది జూన్‌లో పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment