సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం (మే 9వ తేదీ) విడుదల కానున్నాయి. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in ద్వారా, www. sakshieducation.com ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు.
కాగా, తొలుత ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలు వెలువరించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది.
చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు
Comments
Please login to add a commentAdd a comment