సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదలల చేస్తారు. అనంతరం https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
మంత్రి అనుమతితో..
రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగాయి. మొత్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల క్రోడీకరణ ప్రక్రియ, ట్రయల్స్‌ను పూర్తిచేసిన అధికారులు.. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన మంత్రి మంగళవారం ఫలితాలను విడుదల చేసేందుకు అనుమతినిచ్చారు.
‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందవచ్చు.
చదవండి: మహిళలకు శుభవార్త.. రూ.80కే టీ-24 టికెట్! సిటిబస్సులో 24 గంటల పాటు..
Comments
Please login to add a commentAdd a comment