సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా 00 గా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్ ఉమాదేవికి అయిదువేలు జరిమానాతో పాటు ఉద్యోగం నుంచి తొలగించగా, లెక్చరర్ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో తప్పిదాల కారణంగా సుమారు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment