భువనేశ్వర్: జీ20 సదస్సులో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(కేఐఐటీ డీయూ)లో ‘వై20 కన్సల్టేషన్స్’ శుక్రవారం ప్రారంభమైంది.
ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మన దేశాన్ని అగ్రగామిగా తీర్చదిద్దడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. వై20 కన్సల్టేషన్స్‌కు కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment