4 నుంచి బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జనవరి 4వ తేదీ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) బడ్జెట్‌కు సంబంధించి పరిశ్రమ, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలుసహా పలు వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఫిబ్రవరి చివర్లో ఆయన తన రెండవ పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం జైట్లీ వివిధ రంగాల ప్రతినిధులతో జనవరిలో సంప్రదింపులు జరిపే తేదీలను పరిశీలిస్తే...
4: వ్యవసాయం, వాణిజ్య సంఘాల ప్రతినిధులు 5: ఆర్థికవేత్తలు
6: పారిశ్రామికవర్గాలు 7: ఐటీ రంగం ప్రతినిధులు 11: ఫైనాన్షియల్ రంగం రెగ్యులేటర్లు
12: బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు
ఆన్‌లైన్‌లో కూడా: బడ్జెట్ రూపకల్పనపై ఆన్‌లైన్‌లో కూడా సూచనలు అందించడానికి కేంద్రం వీలు కల్పిస్తోంది. ఇందుకు జ్ట్టిఞ:// ఝడజౌఠి.జీఛి.జీఞౌట్ట్చను వినియోగించుకోవాలని ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది.