న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) కోసం ఓ మొబైల్ ఫోన్ యాప్‌ను అభివృద్ధి పరచేందుకు ప్రజల నుంచి సలహాలు స్వీకరించడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సెర్చింజన్ గూగుల్‌తో కలసి బుధవారం ఓ పోటీ ప్రారంభించింది. అప్లికేషన్ నిర్మాణం, అందులో ఏం ఉండాలన్నదానిపై సూచనల కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు పోటీ ప్రారంభించిన సమాచార, సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు నెలల్లో ఈ యాప్ రూపొందుతుందన్నారు. ‘మైగవ్’ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకున్న వారందరూ ఈ పోటీకి అర్హులు.