Financial years budget
-
నేటి నుంచే బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బడ్జెట్‌కు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఇవి శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆమె భేటీ కానున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌కు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఈ నెల 7న ఆర్థిక మంత్రి భేటీ కానున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్ర వరి 1న పార్లమెంట్‌కు సమరి్పంచే అవకాశం ఉంది. -
లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్ హోల్డర్లకి బంపరాఫర్!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్ వెల్లడించింది. ఇందుకు ఈ నెల 22 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది. వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్ జైన్ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
టీటీడీ బడ్జెట్ 3,243 కోట్లు
తిరుమల: 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,243.19 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వార్షిక రివైజ్డ్ బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుమలలో జరిగే పలు అభివృద్ధి పనులు, స్థానికుల సమస్యలపై టీటీడీ బోర్డు సభ్యులు చర్చించారు. అలాగే 2019–20కి సంబంధించిన బడ్జెట్‌ను టీటీడీ విడుదల చేసింది. హిందూ ధర్మ ప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పాలక మండలి చర్చించిన ముఖ్యమైన అంశాలు ►భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత నెలలో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన కథనంపై రూ.100 కోట్ల క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం. టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభువు కనిపిస్తున్నాడని ఆ పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ పరువు నష్టం దావా వేయనుంది. ►జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. ప్రొటోకాల్ ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ►2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా సవరించారు. ►ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం. స్థలం కేటాయించాలని కోరుతూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయం. ►ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణానికి ఆమోదం. ►డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు. ►రమణ దీక్షితులకు గౌరవ ప్రధానార్చకుల(హానరరీ బేసిస్) హోదా కల్పిస్తూ నిర్ణయం. ►టీటీడీలో ప్రత్యేక అకౌంటింగ్ విభాగం ఏర్పాటు. ►రూ.14 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ విమానానికి రాగిరేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ఆమోదం. ఇందుకు అవసరమైన బంగారాన్ని టీటీడీ ఖజానా నుండి తీసుకునేందుకు అనుమతి. ►చెన్నై అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డిని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా(హానరీ బేసిస్) నియమిస్తూ నిర్ణయం. ►తిరుపతిలోని శ్రీ పద్మావతి, శ్రీశ్రీనివాస కల్యాణ మండపాల్లో రూ.3.20 కోట్లతో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు. ►రెండో ఘాట్ రోడ్లో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్సీసీ క్రాష్ బ్యారియర్లు, సీసీ కెర్బ్ వాల్స్ నిర్మాణం. ►తిరుమల ఘాట్ రోడ్లలో మరమ్మతులు చేపట్టేందుకు ఐఐటీ చెన్నై, జేఎన్టీయూ నిపుణులతో కమిటీ ఏర్పాటు. ►తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.14.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం. -
కార్పొరే ట్ల ఆదాయ వృద్ధి అంతంతే
క్యూ2పై క్రిసిల్ అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు స్వల్పంగా 1.6 శాతమే పెరిగే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అదే జరిగితే వరుసగా అయిదో క్వార్టర్లోనూ ఒక్క అంకె స్థాయి వృద్ధి మాత్రమే సాధించినట్లవుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం, పెట్టుబడుల ఆధారిత రంగాలు బలహీనంగా ఉండటంతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు క్షీణించడం తదితర అంశాలు.. ఎగుమతి ఆధారిత రంగ సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ల ఆదాయం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.6 శాతం స్థాయిలోనే వృద్ధి చెందవచ్చని పేర్కొంది. నిర్వహణ లాభం వృద్ధి కేవలం 2 శాతం మేర ఉండొచ్చని తెలిపింది. 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు..గ్యాస్ సంస్థలను మినహాయించి) పనితీరు అధ్యయనం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు క్రిసిల్ వివరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువలో ఈ కంపెనీల వాటా దాదాపు 70 శాతం పైగా ఉంటుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరిమితమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వినియోగం.. ప్రభుత్వ వ్యయాలు స్వల్పంగా పెరగడం, లో-బేస్ ఎఫెక్ట్ తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి ఒక అంకె స్థాయికే పరిమితం కావొచ్చని పేర్కొంది. ఎగుమతి ఆధారిత సంస్థల ఆదాయాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉండగలవని క్రిసిల్ వివరించింది.