ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కంటెంట్‌ను టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందించనుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ఏడాది ఆఖరు నుంచి యాపిల్ టీవీప్లస్, యాపిల్ మ్యూజిక్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ యాప్ ప్రీమియం యూజర్లకు యాపిల్ మ్యూజిక్ అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కస్టమర్లు ప్రీమియం ఎయిర్‌టెల్ వైఫై, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలపై యాపిల్ టీవీప్లస్ ద్వారా హాలీవుడ్ కంటెంట్‌ను పొందవచ్చు. మరోవైపు, మ్యూజిక్ విభాగం నుంచి భారతి ఎయిర్‌టెల్ నిష్క్రమిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొద్ది నెలల్లో వింక్ మ్యూజిక్ యాప్‌ను మూసివేయనున్నట్లు, ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌లోకి తీసుకోనున్నట్లు వివరించాయి. వింక్ మూసివేత విషయాన్ని ఎయిర్‌టెల్ ప్రతినిధి ధ్రువీకరించారు. 2014లో ప్రారంభమైన వింక్ మ్యూజిక్ యాప్‌నకు దాదాపు 10 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్లు ఉన్నారని అంచనా.
ఇదీ చదవండి: స్విగ్గీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?
Comments
Please login to add a commentAdd a comment