Airtel Postpaid
-
ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కంటెంట్‌ను టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందించనుంది. ఎయిర్టెల్ కస్టమర్లకు ఈ ఏడాది ఆఖరు నుంచి యాపిల్ టీవీప్లస్, యాపిల్ మ్యూజిక్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ యాప్ ప్రీమియం యూజర్లకు యాపిల్ మ్యూజిక్ అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కస్టమర్లు ప్రీమియం ఎయిర్టెల్ వైఫై, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలపై యాపిల్ టీవీప్లస్ ద్వారా హాలీవుడ్ కంటెంట్‌ను పొందవచ్చు. మరోవైపు, మ్యూజిక్ విభాగం నుంచి భారతి ఎయిర్టెల్ నిష్క్రమిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొద్ది నెలల్లో వింక్ మ్యూజిక్ యాప్‌ను మూసివేయనున్నట్లు, ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌లోకి తీసుకోనున్నట్లు వివరించాయి. వింక్ మూసివేత విషయాన్ని ఎయిర్టెల్ ప్రతినిధి ధ్రువీకరించారు. 2014లో ప్రారంభమైన వింక్ మ్యూజిక్ యాప్‌నకు దాదాపు 10 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్లు ఉన్నారని అంచనా.ఇదీ చదవండి: స్విగ్గీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం? -
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్ వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ ఇన్‌క్లూజన్ మార్కెట్ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్ యూజర్లు, డిజిటల్ ఫైనాన్షియల్ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్ పాయింట్స్ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు.. -
ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్
ICC పురుషుల ప్రపంచ కప్ 2023 మెగా టోన్నీ షురూ కావడంతో క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్లను ప్రకటించింది. 2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99, ఒక రోజు చెల్లుబాటయ్యేలా రూ.49 ల ప్యాక్‌ను లాంచ్ చేసింది. (గుడ్ న్యూస్: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు) ఈ మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) రూ.49, రూ.99 డేటా ప్యాక్స్ ICC వరల్డ్ కప్ 2023ను ఎంజాయ్ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్లు ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై 6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్లతో పాటు, ఎయిర్టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్ సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టల్ ప్యాక్ తో అన్ని ఓటీటీలు ఫ్రీ
-
అదిరిపోయే బంపరాఫర్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందండిలా!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. నెట్‌ఫ్లిక్స్ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోస్ట్ పెయిడ్ ఆఫర్ ప్యాక్‌ను వినియోగించుకున్న యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ బేసిక్, స్టాండర్డ్ సబ్ స్క్రిప్షన్ బండిల్‌ను ఓటీటీ లవర్స్‌కు ఫ్రీగా అందిస్తుంది. ఇందుకోసం దేశీయ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో జతకట్టింది.ఎయిర్టెల్ ప్రత్యేకంగా రూ.1199, రూ.1599 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను యూజర్లకు అందిస్తుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లు ఈ ప్లాన్లకు అప్‌గ్రేడ్ అవ్వడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా వీక్షించడమే కాదు ఇతర అదనపు ప్రయోజనాల్ని పొందవచ్చు. ఎయిర్టెల్ ఇన్ఫినిటీప్లాన్లో రూ.1199 పోస్ట్ పెయిడ్ ప్యాక్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చు. రెండు ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్‌తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100ఎస్ఎంఎస్, నెలకు 150జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్టెల్ అందిస్తున్న మరో రూ.1599 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్‌ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. యూజర్లు సైతం 3 ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్లను పొందవచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు ఎస్ఎంఎస్లు,నెలకు 250జీబీ డేటాతో ఇతర ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, 6నెలల ఫ్రీ అమెజాన్ సబ్స్క్రిప్షన్, అదనపు ఖర్చు లేకుండా సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్, షా అకాడమీ లైఫ్‌టైమ్ యాక్సెస్, వింక్ (Wynk) ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రీప్షన్లను పొందవచ్చు. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కూడిన నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందాలంటే ►ముందుగా ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా రెండు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో దేనికైనా అప్‌గ్రేడ్ చేయండి. ► ఇప్పుడు, ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేసి పేజీ పైన ఉన్న 'డిస్కవర్ ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్'పై క్లిక్ చేయండి. ►క్లిక్ చేస్తే కింద భాగంలో “ఎంజాయ్ యువర్ రివార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ►కాంప్లిమెంటరీ ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి నెట్‌ప్లిక్స్ సింబల్‌పై ట్యాప్ చేసి వివరాల్ని ఎంటర్ చేయండి ►అంతే ఎయిర్టెల్,నెట్‌ఫ్లిక్స్ అందించే ఫ్రీ సబ్‌స్క్రీప్షన్ ఉచితంగా పొందవచ్చు. చదవండి👉గుడ్ న్యూస్: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు..ఎప్పటి నుంచంటే! -
ఎయిర్టెల్ మరో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా రూ. 299 నెలవారీ అద్దె వర్తించే ఎంట్రీ స్థాయి కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో డేటాను నెలకు 30 జీబీ (గతంలో 10 జీబీ)కి పెంచింది. కొన్ని కార్పొరేట్ ప్లాన్లు రూ. 299 కన్నా తక్కువకి ఉన్నాయని, నెల రోజుల నోటీసు తర్వాత వీటన్నింటిని రూ. 299 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నామని సంస్థ తెలిపింది. దీనితో ప్రతీ యూజరుపై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుతుందని పేర్కొంది. రూ. 399 నెలవారీ అద్దె ప్లాన్‌ను ఉపయోగిస్తున్న కార్పొరేట్ కస్టమర్లకు డేటా పరిమితిని 50 జీబీ నుంచి 60 జీబీకి పెంచినట్లు, ట్రేస్‌మేట్ యాప్, గూగుల్ వర్క్‌స్పేస్, ఎయిర్టెల్ కాల్ మేనేజర్ వంటివి కూడా వీరికి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వివరించింది. అన్ని ప్లాన్లలోనూ ఇకపైనా వింక్ మ్యూజిక్ యాప్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం షా అకాడమీకి ఏడాది పాటు యాక్సెస్ ఉంటుందని తెలిపింది. రూ. 499, రూ. 1,599 నెలవారీ రెంటల్ ఉండే హై–ఎండ్ కార్పొరేట్ ప్లాన్లలో వీఐపీ సర్వీస్ వంటివి కూడా జోడించినట్లు ఎయిర్టెల్ వివరించింది. -
ఎయిర్టెల్ సర్ప్రైజింగ్ ఆఫర్
ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ సర్ప్రైజింగ్ ప్రమోషనల్ ఆఫర్ ను అందించనుంది. మార్చి 13నుంచి పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఉచిత డేటా సేవలను అందించనుంది. ఈ మేరకు ఎయిర్టెల్ యూజర్లకు ఈమెయిల్ సమాచారాన్నందిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఈ వివరాలు స్పష్టం కానున్నాయి. దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్ వర్క్‌నుంచి ఈ సేవలను పొందవచ్చని ఎయిర్ టెల్ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ్చర్యకరమైన ఆఫర్ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాలి. కాగా అన్ లిమిడెట్ కాలింగ్, అన్ లమిటెడ్ డేడా అంటూ దూసుకొచ్చిన రిలయన్స్ జియో ఇటవీల దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచీ జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రైం మెంబర్షిప్ తో పాటు, కొత్త టారిఫ్ లను ప్రకటించింది. అటు ఎయిర్ టెల్ కేడా తాజాగా రూ.345 రీఛార్జ్ ప్యాక్ పై రోజు 1 జీబీ డేటాను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.